కృష్ణుడిగా చేయను., కర్ణుడు కోసం అడిగారు… మహాభారతం గురించి నాగ్ చెప్పిన విషయం

కొన్నేళ్ళ క్రితం 90 ల్లో ఒక టీవీ సీరియల్ భారత దేశం లోనే ఒక సంచలనమయ్యింది, మత, భాషా, ప్రాంతీయ భేదాలను కూడా దాటి దేశం మొత్తాన్నీ కట్టి పడేసింది. ఆది వారం వచ్చిందంటే మహాభారత్ ని చూడటానికి టీవీల ముందుకు ఇంటిల్లి పదీ వచ్చేవారు. విపరీత మైన భక్తి తో టీవీ సెట్లకు పూజలు చేసిన వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు నమ్మక పోవచ్చు గానీ ఆరోజుల్లో ఈ సంఘటన లూ చోటు చేసుకున్నాయి… ఇప్పుడు మహా భారతం బుల్లి తెర నుంచి వెండి తెరకెక్క బోతోంది… ఇప్పుడు అసలు మొదలు కాకముందే దేశం మొత్తాన్నీ తన వైపుకు తిప్పుకుంటోందీ వార్త… 1000 కోట్ల ఈ భారతం లో నాగార్జున కూడా నటుడిగా భాగం పంచుకో బోతున్నారన్న వార్త

జనవరిలో మహాభారతం తెరకెక్కించటం పై స్పందించిన రాజమౌళి, తనకు ఆలోచన ఉన్నా వెంటనే ఆ సినిమా చేసే అవకాశం లేదని తెలిపాడు. షారూఖ్ కూడా మహాభారతం తెరకెక్కించాలన్న కోరిక ఉందని చెప్పినా.. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అందులో షారూఖ్ ఏ పాత్రలో కనిపించనున్నాడు లాంటి అంశాలను మాత్రం ప్రస్థావించలేదు.

మహాభారతం సినిమా.. సెట్స్ మీదకు రాకుండానే భారీ చర్చకు తెర తీసింది. దానికి కారణం.. భారతీయ సినిమా చరిత్రలో కనివినీ ఎరుగని భారీ బడ్జెట్తో సినిమాను ప్లాన్ చేయడమే కావచ్చు.దర్శకధీరుడు రాజమౌళి, త్వరలో మహాభారతాన్ని భారీగా వెండితెర మీద ఆవిష్కరించాలనుందని తెలిపాడు. అయితే ఇంతటి భారీ కథను తెరకెక్కించడానికి తన అనుభవం సరిపోదన్న జక్కన్న ఎప్పటికైనా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించాడు.

దాదాపు వెయ్యికోట్ల బడ్జెట్తో నిర్మించనున్న ఈ సినిమాలో నటించేందుకు ఇప్పటికే ప్రముఖ మలయాళ హీరో మోహన్ లాల్ ఓకే చెప్పేయటం తెలిసిందే. కథ ఆయన సెంట్రిక్ గానే ఉంటుంది. ఈ సినిమాలో పలు పాత్రల కోసం తెలుగుకు చెందిన హీరోల్ని అడిగినట్లుగా వార్తలు వచ్చాయి.

కర్ణుడి వేషం కోసం నాగ్ ఇదిలా ఉంటే.. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో తనను ఓ పాత్ర కోసం సంప్రదించిన విషయాన్ని వెల్లడించారు నాగ్. తనను కర్ణుడి వేషం వేయాలని అడిగారని.. స్క్రిప్ట్ మొత్తం చదివానని.. చాలా బాగుందన్నారు. కర్ణుడి పాత్ర వేస్తారా? అని అడిగారని.. చిన్న పాత్ర అయినా ప్రాధాన్యం ఉంటే చేస్తానని చెప్పినట్లుగా వెల్లడించారు.

ఆ వేషం వేస్తే మీసాలు తీయాల్సి వస్తుంది అన్ని పనులు అయ్యాక తన దగ్గరకు రావాలని వారికి చెప్పినట్లుగా పేర్కొన్నారు. కృష్ణుడి పాత్రకు బాగుంటారు కదా? అన్న మీడియా ప్రశ్నకు బదులిచ్చిన నాగ్.. ఆ వేషం వేస్తే మీసాలు తీయాల్సి వస్తుందని..అది బాగుండదనే అంటూ తనదైన స్టైల్లో నవ్వేశారు నాగ్. సో.. మహాభారతం భారీ ప్రాజెక్టులో మోహన్ లాలే కాదు.. నాగ్ పాత్ర కూడా కన్ఫర్మ్ అయినట్లేనని అనుకోవాలా?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *