రెండు బీర్లు తాగి, చికెన్ బిర్యానీతో ఎంజాయ్‌ చేశా: నాగ్‌

పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రాజుగారి గది 2”. అక్కినేని నాగార్జున, అక్కినేని సమంతలు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఓంకార్ దర్శకుడు.

శుక్రవారం (అక్టోబర్ 13) విడుదలైన ఈ చిత్రం సూపర్ పాజిటివ్ టాక్ తో భారీ వర్షాలను సైతం ఖాతరు చేయకుండా ఫెంటాస్టిక్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర విజయం అందిస్తున్న ఆనందాన్ని ప్రేక్షకులతో, మీడియాతో పంచుకోడానికి చిత్రబృందం సక్సెస్ మీట్ ను నేడు (అక్టోబర్ 15) సాయంత్రం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నాగార్జున మాట్లాడుతూ.. “చాలారోజుల తర్వాత తృప్తిగా రెండు బీర్లు తాగి, చికెన్ బిర్యానీ తిని సంతోషంగా ఎంజాయ్ చేశాను. నిన్నమొన్నటివరకూ “రాజుగారి గది 2” మేకింగ్, నాగచైతన్య-సమంతల పెళ్లిలో చాలా బిజీగా ఉండిపోయాను. మా డైరెక్టర్ ఓంకార్, ప్రొడ్యూసర్స్ పివిపి అండ్ జగన్మోహన్ రెడ్డి, డైలాగ్ రైటర్ అబ్బూరి రవి నలుగురు పిల్లర్స్ లాంటివారు.

మా అమ్మకు ఇష్టమైన ఒక జ్యోతిష్కుడు “నువ్వు కొత్త పాత్రలు పోషిస్తే సినిమా హిట్ అవుతుంది” అన్నారు. అది “రాజుగారి గది 2″తో మరోమారు ప్రూవ్ అయ్యింది. వర్షాలు పడుతున్నా కలెక్షన్స్ ఎక్కడా తగ్గలేదు. “సోగ్గాడే చిన్ని నాయన” కంటే పెద్ద హిట్ గా “రాజుగారి గది 2″ నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలను” అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *