యాంకర్‌కు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..

‘రాజుగారి గది-2’ సినిమా విడుదల నేపథ్యంలో నాగార్జున, సమంత బిజీబిజీగా ప్రమోషన్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనిట్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నాగార్జున యాంకర్ శ్యామలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.. శ్యామల నాగార్జునను ‘మీసం ఎందుకు తీసేశార’ని ప్రశ్నించగా. దానికి నాగార్జున సమాధానం చెబుతూ, ‘ఇలాగే చాలామంది బాగుందంటున్నారు… ఏం బాగాలేదా?’ అని ప్రశ్నించారు. దానికి శ్యామల సమాధానమిస్తూ, ‘ఛఛ అలాంటిదేం లేదు. మీరు చాలా బాగున్నారు…కానీ మన్మధుడికి మీసం ఉంటే కొంచెం రొమాంటిక్ గా ఉంటుంది కదా?’ అంది.

దీంతో పక్కనే ఉన్న సమంతతో ‘చైతన్యకి పెళ్లి చేశారు. పోటీగా వయసు తగ్గిద్దామని ప్రయత్నిస్తున్నారా?’ అని ప్రశ్నించింది. వెంటనే కల్పించుకున్న నాగార్జున..’పక్కనే కోడలుంది..బిహేవ్ యువర్ సెల్ప్’ అని సుతిమెత్తగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దానికి సమంత…’అయ్యో ఆయనకు నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు’ అంటూ సమాధానం చెప్పింది. నాగార్జున ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘రాజుగారి గది 2’. సమంత, సీరత్‌ కపూర్‌ కీలక పాత్రధారులు పోషిస్తున్నారు. ఓంకార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *