పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండల సినిమా పేరు……..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌ల ముంబైలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమాకు `ఫైట‌ర్` అనే టైటిల్ పెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కానీ  ఈ సినిమా టైటిల్ మారింద‌ట‌. ఈ సినిమాకు `లైగ‌ర్` అనే టైటిల్‌ను పెట్టాల‌ని పూరి అనుకుంటున్నారట‌. మ‌గ సింహం, ఆడ పులికి పుట్టే హైబ్రీడ్ పిల్ల‌ను లైగ‌ర్ అంటారు. అంటే రెండు శ‌క్తివంత‌మైన జంతువుల క‌ల‌యిక‌తో పుట్టే జంతువు పేరునే త‌న సినిమాకు పెట్టాల‌ని పూరి యోచిస్తున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని పూరి, ఛార్మితో పాటు క‌ర‌ణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుందని స‌మాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *