హద్దులు దాటిన… నందమూరి ఫ్యాన్స్..!
కృష్ణా జిల్లాలో నందమూరి యువసేన పేరిట కొంతమంది యువకులు హంగామా సృష్టించారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుక అంటూ వీళ్లు హల్చల్ చేశారు. వీళ్లంతా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. నందమూరి కుటుంబ అభిమానుల అట. మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకను వీళ్లంతా ఉమ్మడిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫుల్ తాగి ఎంజాయ్ చేశారు.
మరి అంత వరకూ ఎవరికీ అభ్యంతరం లేదు.. అయితే కార్ల ర్యాలీ పేరుతో వీరు జాతీయ రహదారిపై హడావుడి చేశారు. కృష్ణా జిల్లా కంచికచర్ల పరిధిలోని నేషనల్ హైవేపై ఈ సంఘటన చోటు చేసుకుంది. హైవేపై రోడ్డు మరమ్మతుల నిమిత్తంకొంతమంద పని చేస్తున్నారు. నందమూరి యువ సేన హడావుడికి వారు భయాందోళనకు గురి అయ్యారు.
ఇలా హంగామా చేసిన వీరిపై హైవే కార్మికులు కేసులు పెట్టబోయారు. అయితే పోలీసులు కేసులను తీసుకోకపోవడం గమనార్హం. మరి అధికార పార్టీకి చెందిన సినీ హీరో తనయుడి అభిమానగణం కాబట్టి వాళ్లు ఏం చేసినా వదిలి పెట్టాలని పోలీసులు కూడా స్పష్టత ఇచ్చినట్టు అయ్యింది.