‘నాని గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ

నాచురల్ స్టార్ నాని హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించిన సినిమా  ‘నానిస్ గ్యాంగ్ లీడర్’.  జెర్సీ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు అటు దర్శకుడు విక్రమ్‌కు కూడా ఈ మధ్య కాలంలో ఆయన స్ధాయికి, సామర్థ్యానికి తగ్గ హిట్ పడలేదు. దీంతో విక్రమ్ కసితోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా హ్యుమర్‌తో కూడిన రివేంజ్ స్టోరీ అని చిత్ర బృందం చెబుతుంది. మరి నాని సూపర్ హిట్ అందుకున్నాడా?

కథ:

పెన్సిల్ పార్థసారధి(నాని) రివెంజ్ రైటర్. హాలీవుడ్ సినిమాల్ని చూసి వాటి ద్వారా నవలలు రాసుకుంటూ ఫేమస్ రైటర్  గా చలామణి అవుతాడు. మరోవైపు ఓ బ్యాంక్‌లో 300 కోట్ల చోరి జరుగుతుంది. ఆరుగురు వ్యక్తులు కేవలం 18 నిమిషాల సమయంలో బ్యాంక్‌లోని సొమ్మంతా దోచేస్తారు. కానీ వారిలో ఒకడు మిగతా ఐదుగురిని చంపి డబ్బంతా ఎత్తుకెళ్లిపోతాడు. ఆ ఐదుగురికి సంబంధించిన ఆడవాళ్లు ఎలాగైన తమ వాళ్లను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటారు. అందుకోసం పెన్సిల్ పార్థసారధి సహాయం తీసుకోవాలనుకుంటారు.  ఈ రివెంజ్ తన రైటింగ్ కెరీర్ కు ఉపయోగపడుతుందని ఒకే చెప్తాడు. ఆ ఐదుగురు ఆడవాళ్లతో కలిసి పెన్సిల్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ కథకు ఇండియాస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ దేవ్‌ (కార్తికేయ)కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

నాని లాంటి నటుడు విక్రమ్‌ లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తుండటంతో గ్యాంగ్‌ లీడర్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రతీకార కథల్లో ఒక సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. ఐదుగురు ప్రతికరం తీర్చుకోవాలని నిర్ణయించుకోవడం, అందుకు ఒక రచయిత సహకారం తీసుకోవడం కథకి కొత్తదనాన్ని తెచ్చిపెట్టింది. అయితే కథ నైపథ్యనికి తగ్గట్టుగా సినిమాని కూడా ఆసక్తిగా ప్రారంభించాడు. దర్శకుడు. పెన్సిల్ సారధి పాత్ర పరిచయం దగ్గర నుంచి కథలో కామెడీ పెరుగుతుంది. ప్రథమార్ధంలో కామెడీ హైలెట్ అయ్యింది. సినిమాను ఇంట్రస్టింగ్‌ సీన్‌తో ప్రాంభించిన దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని సుదీర్ఘంగా చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో రాను రాను సినిమా బోరింగ్‌గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పెన్సిల్ పాత్రలో ఒదిగిపోయిన నాని.. కామెడీ, సెంటిమెంట్‌, రొమాన్స్‌ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. విలన్‌గా  మెప్పించాడు. సినిమా అంతా సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితం కావటంతో నటనకు పెద్దగా అవకాశం లేదు. అయితే లుక్స్‌, యాటిట్యూడ్‌తో మంచి విలనిజం చూపించాడు.
ప్లస్ పాయింట్స్: కథ, నాని నటన, కామెడీ, నేపథ్య సంగీతం

నెగెటివ్ పాయింట్స్: ఊహకు అందెట్టు సాగే కథనం

టైటిల్: నాని గ్యాంగ్‌ లీడర్‌

తారాగణం: నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌

సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్

దర్శకత్వం: విక్రమ్‌ కె కుమార్‌

సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌

నిర్మాత: మోహన్ చెరుకూరి, రవిశంకర్‌ యలమంచిలి, నవీన్‌ ఎర్నేని

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *