నాని కొత్త అవతారం…

నాచురల్ స్టార్ నాని తను నటించబోయే తరువాతి సినిమాలో విలన్ గా నటించబోతున్నారు. ఎప్పుడు విభిన్న పాత్రలు చేసే నాని ఈ సారి కూడా విభిన్న పాత్రతో రాబోతున్నాడు. నాని తన 25వ ‘వి’లో విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటి వరకూ కనిపించనట్టుగా కొత్తగా కనిపిస్తారట. విషయానికి వస్తే ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నా ఈ సినిమాలో నాని సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనున్నారట. అందుకోసం ప్రస్తుతం జిమ్‌ చేస్తూ బరువు తగ్గించే పనిలో ఉన్నారట. కొత్త లుక్స్ తో ఆడియన్స్ ను షాక్‌ చేయాలనుకుంటున్నారని తెలిసింది. సుధీర్‌బాబు, నాని, అదితీరావ్‌ హైదరీ, నివేదా థామస్‌ ముఖ్య పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. నానీని హీరోగా పరిచయం చేసిన మోహనకృష్ణ దర్శకత్వంలోనే నాని విలన్‌గా యాక్ట్‌ చేయడం విశేషం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *