‘పెళ్లిచూపులు’ ‘జనతా గ్యారేజ్’కు జాతీయ అవార్డులు

తెలుగు సినిమా ‘పెళ్లి చూపులు’కు జాతీయ అవార్డు దక్కింది. శుక్రవారం ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ సినిమాను ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరి కింద ఎంపిక చేశారు. ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు తరుణ్ భాస్కర్‌ (పెళ్లిచూపులు)ను వరించింది. దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యాశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించారు. ఈ లోబడ్జెట్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఇక ఉత్తమ నృత్య దర్శకుడిగా రాజుసుందరం (జనతా గ్యారేజ్)ను, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా శతమానం భవతిని ఎంపిక చేశారు. ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ (రుస్తుం), ఉత్తమ హిందీ చిత్రంగా నీర్జాను ప్రకటించారు.
అవార్డుల వివరాలు:

ఉత్తమ నటుడు – అక్షయ్‌కుమార్‌ (రుస్తుం)
ఉత్తమ తెలుగు చిత్రం- పెళ్లిచూపులు
ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా
ఉత్తమ సామాజిక చిత్రం – పింక్‌
ఉత్తమ కన్నడ చిత్రం – రిజర్వేషన్‌
ఉత్తమ తమిళ చిత్రం – జోకర్‌
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – శతమానం భవతి
ఉత్తమ బాలల చిత్రం – ధనక్‌
ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌ – పీటర్ హెయిన్స్‌ (పులిమురుగన్‌‌)
ఉత్తమ నృత్యదర్శకుడు – రాజు సుందరం (జనతా గ్యారేజ్‌‌)
ఉత్తమ సంగీత దర్శకుడు – బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)
ఉత్తమ సంభాషణలు: తరుణ్ భాస్కర్‌ (పెళ్లిచూపులు)
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ –  శివాయ్‌
సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రంగా యూపీ ఎంపిక

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *