బాలీవుడ్ రీమేక్ లో నాని?

ఆయుష్మాన్ ఖురాన్ హీరోగా హిందీలో ఘనవిజయం సాధించిన సినిమా అంధాధున్‌. ఈ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇప్పుడు తెలుగు వర్షన్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు నాని ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తమిళ వర్షన్‌లో ప్రశాంత్‌ హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నటనకు గాను ఆయుష్మాన్‌ జాతీయ అవార్డును కూడా సాధించాడు. ఇప్పటికే గ్యాంగ్ లీడర్ షూటింగ్‌ పూర్తి చేసిన నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత అంధాదున్‌ రీమేక్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *