బాలయ్య 102వ సినిమాలో నయనతార లుక్ ఇదే!

వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత నందమూరి బాలకృష్ణ స్పీడు పెంచారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తన 101వ సినిమా పైసా వసూల్‌ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టగానే 102వ సినిమాకు కొబ్బరి కాయ కొట్టేశారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఒక వైపు పైసా వసూల్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటునే మరో వైపు తన 102 సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు బాలయ్య.
సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల తార నయనతార నటిస్తోంది. సింహా, శ్రీరామ రాజ్యం సినిమాల తర్వాత మూడో సారి బాలయ్యతో జత కడుతున్న ఈ భామ.. తాజా సినిమాలో మరింత అందంగా కనిపించబోతోంది. టాలీవుడ్ స్టయిలిస్ట్ నీరజా కోన సెట్స్‌లో నయనతారతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. బాలయ్య 102వ సినిమాలో నయనతార లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో బాలయ్య-నయనతార జోడీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *