‘భలే భలే..’ రికార్డును తుడిచేశాడు

ఫిబ్రవరి నెల అంటే అన్ సీజన్. ఇలాంటి సీజన్లో రిలీజైంది నాని సినిమా ‘నేను లోకల్’. పైగా తర్వాతి వారం రెండు భారీ సినిమాలు (ఎస్-3.. ఓం నమో వేంకటేశాయ) ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ తర్వాతి వారం ఇంకో భారీ చిత్రం ‘ఘాజీ’ రిలీజైంది. అయినప్పటికీ నాని సినిమా ప్రత్యేకతను చాటుకుంది. నిలకడగా వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్లింది. తొలి రోజు వసూళ్ల దగ్గర్నుంచి నాని కెరీర్ రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేస్తూ వచ్చిన ‘నేను లోకల్’.. ఇప్పుడు అతడి కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అయిన ‘భలే భలే మగాడివోయ్’ను కూడా దాటేసింది. ఇప్పటిదాకా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.31 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. ‘భలే భలే మగాడివోయ్’ రూ.30 కోట్ల లోపే షేర్ వసూలు చేసింది.

తొలి వారంలోనే రూ.20 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కు వచ్చేసిన ‘నేను లోకల్’. రెండో వీకెండ్ నుంచి బయ్యర్లకు లాభాలు అందిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా లాభం రూ.9 కోట్లకు చేరుకుంది. ఈ వారం ‘ఘాజీ’ పెద్ద ఎత్తున రిలీజైనా సరే.. ‘నేను లోకల్’కు అదనంగా థియేటర్లు కలవడం విశేషం. ‘నేను లోకల్’ రిలీజైన తర్వాతి వారం వచ్చిన ఎస్-3.. ఓం నమో వేంకటేశాయ చిత్రాల కంటే కూడా అదే ఎక్కువ వసూళ్లు రాబడుతుండటం విశేషం. ‘ఘాజీ’ పోటీని కూడా బాగానే తట్టుకుంటూ మూడో వీకెండ్లోనూ స్టడీగా కలెక్షన్లు తెస్తోంది నాని సినిమా. అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే మిలియన్ మార్కును దాటేసింది. ఫుల్ రన్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.35 కోట్ల షేర్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా నానిని మరో మెట్టు ఎక్కించిందనడంలో సందేహం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *