ఆడియో ఫంక్షన్ లేని కాటమరాయుడు

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడుపై విపరీతమైన బజ్ నెలకొంది. 30 సెకన్ల టీజర్ తో మొత్తం సినిమాని లైమ్ లైట్ లోకి తెచ్చేశాడు పవర్ స్టార్. పెద్దగా హోప్స్ లేని మూవీ అనుకుంటే.. ఇప్పుడు 100 కోట్ల బిజినెస్ చేసే సినిమాగా కాటమరాయుడు అవతరించేసింది. ఇంతటి భారీ చిత్రానికి ఇప్పుడు ఆడియో ఫంక్షన్ చేయడం లేదని తెలుస్తోంది.

ఏ సినిమాకైనా పబ్లిసిటీ కోసం ఇప్పుడు గ్రాండ్ ఆడియో ఫంక్షన్ కామన్ గా మారిపోయింది. కానీ పవన్ మాత్రం కాటమరాయుడుకు ఆడియో వేడుక చేయబోవడం లేదట. దీనికి బదులు.. కాటమరాయుడు రిలీజ్ కు సరిగ్గా ఓ వారం ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారని తెలుస్తోంది. అలాగే ముందునుంచే ప్లాన్ చేసుకుని.. ఒక్కో పాటను డైరెక్టుగా రిలీజ్ చేసేయనున్నారట. జనాల్లోకి ఆడియో వెళ్లి కిక్ ఇచ్చేందుకు.. ఈ ఫార్మాట్ బాగా ఉపయోగపడుతోంది. పవన్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో కానున్నాడని అంటున్నారు.

అల్లు అర్జున్ మూవీ సరైనోడు.. రామ్ చరణ్ నటించిన ధృవ.. మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. సాయిధరం తేజ్ విన్నర్ లకు కూడా ఇలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేశారు. ఇప్పుడు కాటమరాయుడు విషయంలో  పవన్ కళ్యాణ్ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కే సెట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *