Official : ఎన్టీఆర్ బిగ్ బాస్ లుక్

ఎన్టీఆర్ ఊపు మీదున్నాడు. అంటే అది అలాంటిలాంటి ఊపు కాదు. వరుసగా మూడు సినిమాలు కొట్టిన ఊపు. మూడో సిినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఊపు. అన్నింటికీ మించి క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకూ కూడా పిచ్చి క్లోజ్ అయిపోయాడు. అందుకే బిగ్ బాస్ వాళ్ళకు కూడా వాళ్ళ షో రన్ చేయడానికి, రేటింగ్స్ కొల్లగొట్టడానికి అవసరమైన స్టార్ ఢం ఎన్టీఆర్‌లో కనిపించింది. ఇప్పటి వరకూ ఏ తెలుగు స్టార్ హీరో కూడా తీసుకోనంత రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఎన్టీఆర్‌ని తీసుకున్నారు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే అత్యంత ఎక్కువ అమౌంట్ ఎన్టీఆర్‌కి చెల్లించారు.

ఇప్పుడు ఇండియా అంతా పాపులర్ షో అని చెప్పలేం కాని.. సెలబ్రిటీల కొత్తరకం స్కాండల్స్.. గొడవలు.. ముద్దులు.. యుద్దాలతో ”బిగ్ బాస్” అనే షో బాగా పాపులరైంది. ఈ షో హోస్టు కంటే కూడా లోపల బిగ్ బాస్ హౌసులో ఓవర్ యాక్షన్ చేసే కంటెస్టెంటుల కారణంగా విపరీతమైన పబ్లిసిటీ సంపాదించింది. అయినా కూడా సల్మాన్ ఖాన్ ఈ షో ను తనదైన శైలిలో హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగులో ఈ బాధ్యత ఎన్టీఆర్ తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఆ స్థాయి అమౌంట్‌కి ఎన్టీఆర్ న్యాయం చేస్తాడా? బుల్లితెరపై ఎన్టీఆర్ హంగామా ఏ స్థాయిలో ఉంటుంది? తన సినిమాల రేటింగ్స్‌తో మాటీవీని నెంబర్ ఒన్ స్థానానికి తీసుకెళ్ళిన ఎన్టీఆర్ బిగ్ బాస్‌తో కూడా అదే స్థాయి సంచలనం సృష్టిస్తాడా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఒక్క ఫోటోతో ఆన్సర్ చెప్పేశాడు తారక్. అల్ర్ట్రా క్లాస్ లుక్‌లో అదరగొట్టాడు. అన్నింటికీ మించి బుల్లితెర ప్రేక్షకులను అలరించే చిలిపి కృష్ణుడు తనలో ఉన్నాడని కన్ను గీటుతూ కన్ఫాం చేశాడు. ఆ ఒక్క లుక్‌తోనే బిగ్ బాస్ షో హోస్టింగ్ విషయంలో తాను ఏ స్థాయిలో అల్లరి చేస్తాడా…హల్చల్ చేస్తాడో నిరూపించాడు ఎన్టీఆర్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *