త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ మరో ప్రయోగం.. న్యూలుక్, స్పెషల్ రోల్‌..

జై లవకుశ చిత్రం ఓ వైపు విడుదల అవుతుంటే…. మరోవైపు ఎన్టీఆర్ కొత్త చిత్రంపై దృష్టి పెట్టారు. జైలవకుశ తర్వాత యంగ్ టైగర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఈ అంశంపై జై లవకుశ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఎన్టీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు ఎన్టీఆర్. త్వరలో విడుదల కాబోతున్న జై లవ కుశలో రావణ పాత్రతో ఓ ప్రయోగానికి తెరలేపాడు. తన తదుపరి చిత్రంలో నటుడిగా మారో ప్రయోగానికి శ్రీకారం చుట్టునున్నట్టు సమాచారం.

త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గనున్నాడట. అలాగే లుక్ పరంగా… ఫిజిక్ పరంగా పలు మార్పులు చేయబోతున్నాడని సమాచారం. అలాగే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోబోతున్నాడు… అందుకోసం దక్షిణాసియాలోని ఓ దేశంలో దీనికి సంబంధించి శిక్షణ తీసుకోబోతున్నాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ అంశంపై ఎన్టీఆర్ స్పందిస్తూ… త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేయబోతున్నానని చెప్పారు. కథకు మంచి స్కోప్ ఉందని త్రివిక్రమ్ చెప్పారు. సో… వైరల్ అవుతున్న వార్తలు నిజమేనని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించి ఓ విద్యను ఎన్టీఆర్ నేర్చుకోనున్నట్టు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు

టాలీవుడ్‌లో ఈ తరం దర్శకుల్లో అందరితోను విభిన్నమైన చిత్రాలు చేశాడు తారక్. త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా పెండింగ్ ఉంది. విలక్షణ దర్శకుడిగా పేరున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలన్న అభిమానుల ఆ కోరిక కూడా వచ్చే సినిమాతో పూర్తి కానున్నది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మారి వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఆ చిత్రం ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *