పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా…. ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ప్రారంభం (లైవ్ వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్ రాధాకృష్ణ(చిన బాబు) నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది, దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్‌కు అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *