జై లవ కుశ: ‘జై’ పాత్రలో ఎన్టీఆర్ విలనిజం… టీజర్ కేక

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవ కుశ’ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహస్తున్నఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు.

జై, లవ, కుశ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. గురువారం సాయంత్రం 5.22 గంటలకు జై పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తేంటే ‘జై’ పాత్ర రావణుడు తరహాలో విలనిజంతో కూడుకున్న పాత్ర అని తెలుస్తోంది. హావభావాల్లో రౌద్రం ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ ఇరగదీశాడు. ఈ పాత్రకు కాస్త నత్తి కూడా ఉంటుందని తెలుస్తోంది.

టీజర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎన్టీఆర్ పోషిస్తున్నమరో రెండు పాత్రలకు రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఒక పాత్రకు హీరోయిన్ లేదని తెలుస్తోంది

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *