బాలయ్య కాళ్లకు నమస్కరించిన ఎన్టీఆర్! బాలయ్య ముఖంలో సంతోషం (వీడియో)

విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి తరానికొక్క నటుడు వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన వారసత్వంతో బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ వంటి నటులు వెండితెరపై ఓ వెలుగువెలుగుతున్నారు. రాబోయే కాలంతో మరింత మంది ఎన్టీఆర్ వారసులు వెండితెరపై తమ టాలెంటు నిరూపించుకోవడానికి ఇప్పటి నుండే సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు సీనియర్ ఎన్టీఆర్‌కు మునిమనవడు, హరికృష్ణకు మనవడు, దివంగత జానకిరామ్ తనయుడైన మాస్టర్ ఎన్టీఆర్.

తొలి సినిమాకే ఇటీవల వైజాగ్ లో జరిగిన టీఎస్ఆర్ అవార్డుల వేడుకలో మాస్టర్ ఎన్టీఆర్ తన మొదటి సినిమా దానవీర శూరకర్ణ చిత్రానికిగాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. తన తాతయ్య బాలకృష్ణ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాడు.

అవార్డు తీసుకోవడానికి ముందు మాస్టర్ ఎన్టీఆర్ బాలయ్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. చిన్న కుర్రాడే అయినా ఎనలేని వినయవిధేయతలు ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. మాస్టర్ ఎన్టీఆర్ కు అవార్డు ఇస్తున్న సమయంలో బాలయ్య ముఖంలో కూడా ఎంతో సంతోషం కనిపించింది.

దానవీర శూరకర్ణ స్వర్గీయ నందమూరి జానకిరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘దానవీర శూరకర్ణ’. జె.వి.ఆర్‌ దర్శకుడు. శ్రీసాయి జగపతి పిక్చర్స్‌, సంతోష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థుసంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జె.బారాజు, చసాని వెంకటేశ్వరరావు నిర్మాతలు.

బాల నటులు స్వర్గీయ జానకీరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ కృష్ణుడిగా, రెండో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా ఈ చిత్రంలో నటించారు. ఇద్దరూ కూడా అద్భుతంగా యాక్ట్‌ చేశారు. నటనలో తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకున్నారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *