ఎవరు మీలో కోటీశ్వరులు మరియు బిగ్ బాస్ సీజన్ 5 ఎవరిది పై చేయి?

ఓవైపు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జెమినీ టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం మొదలైంది. ఆ వెంటనే మినిమం గ్యాప్ లో నాగార్జున హోస్ట్ గా స్టార్ మా ఛానెల్ లో బిగ్ బాస్ సీజన్-5 మొదలైంది. దీంతో సహజంగానే ఈ రెండు కార్యక్రమాల మధ్య పోటీ ఏర్పడింది.

అంచనాలకు తగ్గట్లుగా రెండు షో లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు షో లు రేటింగ్ విషయంలో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి బిగ్ బాస్ పై చేయి ఉన్నా కూడా వారం వారం ఎన్టీఆర్ షో కూడా పుంజుకుంటూ ఉంది. మొదటి వారంతో పోల్చితే రెండవ వారం… రెండవ వారంతో పోల్చితే మూడవ వారంలో రేటింగ్ భారీగా పెరిగింది. అందుకే బిగ్ బాస్ కు ఖచ్చితంగా ఎవరు మీలో ఎవరు కోటీశ్వరులు ఆ రేంజ్ రేటింగ్ ను చేరుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా ఎన్టీఆర్ షో రేటింగ్ వచ్చింది. ప్రారంభ ఎపిసోడ్ లో దీనికి గరిష్టంగా 11.37 టీఆర్పీ వచ్చింది. మొదటి వారం సగటు టీఆర్పీ 6.76 కాగా.. తాజాగా మూడోవారం యావరేజ్ టీఆర్పీ 7.30గా వచ్చింది. ఈ వారం ఎన్టీఆర్ షో కు వచ్చిన హయ్యస్ట్ రేటింగ్ 7.99.

ఇక నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్-5 విషయానికొద్దాం. దీనికి వచ్చిన హయ్యస్ట్ రేటింగ్ (ప్రారంభ ఎపిసోడ్ కు) 15.66. ఎస్ డీ, హెచ్ డీ బాక్సుల్లో కలిపి చూసుకుంటే రేటింగ్ 18. ప్రారంభ ఎపిసోడ్ ను మినహాయిస్తే, మిగతా అన్ని ఎపిసోడ్స్ కు టైమింగ్ మార్చారు. ప్రైమ్ టైమ్ దాటి కాస్త లేట్ గా రాత్రి 10 గంటల నుంచి బిగ్ బాస్ మొదలౌతోంది. దీంతో టీఆర్పీ తగ్గుతుందని చాలామంది భావించారు.

కానీ బిగ్ బాస్ కంటూ ప్రత్యేకంగా ఆడియన్స్ ఫిక్స్ అయి ఉన్నారు. కంటెస్టెంట్లు ఎవరైనా, ఈ రియాలిటీ షోకు వీక్షకులు ఫిక్స్. అందుకే టైమ్ మారినా బిగ్ బాస్ సీజన్-5 మంచి టీఆర్పీ సాధించింది. సాధారణ రోజుల్లో 6కి పైగా రేటింగ్ సాధిస్తూ కొనసాగుతోంది.

బిగ్ బాస్ సీజన్ 5 ఆరంభంకు ముందు బజ్ క్రియేట్ చేయడంలో మా వర్గాల వారు విఫలం అయ్యారు అనే టాక్ వచ్చింది. వారి నుండి పెద్ద ఎత్తున ప్రచారం జరగలేదు. కాని ఇప్పటికే వచ్చిన నాలుగు సీజన్ లు సక్సెస్ అయ్యి వాటి ప్రేక్షకులు తదుపరి సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొత్త ప్రేక్షకులు కూడా యాడ్ అయ్యి ఉంటారు. అందుకే భారీగా రేటింగ్ నమోదు అవుతుంది. స్టార్ మా లోనే కాకుండా హాట్ స్టార్ లో కూడా చూసే వారు చాలా మంది ఉన్నారు. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు మొదటి వారంలో రేటింగ్ విషయంలో కాస్త నిరాశ పర్చినా కూడా వారం వారం కంటెస్టెంట్స్ విషయంలో మార్పు రావడం మరియు సరదాగా షో ను ఎన్టీఆర్ నడుపుతున్న కారణంగా అంచనాలు భారీగా పెరిగి అనూహ్యంగా రేటింగ్ పెరుగుతూ ఉంది. ప్రస్తుతానికి కాస్త బిగ్ బాస్ తో ఎన్టీఆర్ పై చేయి ఉన్నా కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడితో పుంజుకుని ఖచ్చితంగా పై చేయి సాధిస్తాడనే నమ్మకంను జనాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రెండు షో లు వేరు వేరు టైమ్స్ లో వస్తున్న కారణంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా రెండు షో లు కూడా భారీ రేటింగ్ ను దక్కించుకుంటున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *