బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేస్తుండగా వీడియో తీసిన వీడియో

బాయ్‌ ఫ్రెండ్‌తో బహిరంగంగా సెక్స్ చేసిన ఓ నర్సింగ్ స్టూడెంట్‌ చిక్కుల్లో పడింది. ఈ తతంగాన్ని సెల్‌ఫోన్లో రికార్డ్ చేసిన ముగ్గురు యువకులు ఆమెను బెదిరించి అనేకసార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి తోడు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. తాము చెప్పిన మాట వినకపోయినా, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా వీడియో బయటపెట్టి పరువు తీస్తామని బెదిరించారు. దీంతో వేధింపులు మరింత ఎక్కువ కావడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.

వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలోని ఓ పట్టణానికి చెందిన యువతి హాస్టల్‌లో ఉంటూ నర్సింగ్ కోర్సు చదువుతోంది. ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆగస్టు నెలలో ఓ రోజు రాత్రివేళ హాస్టల్ పరిసరాల్లోనే కలుసుకున్న ఈ జంట హద్దులు దాటింది. అదే సమయంలో అటుగా వచ్చిన స్థానిక యువకులు విజయ్‌కుమార్(23, శంకర్(27), వరదరాజన్(27) ఆ తతంగాన్నంతా వీడియో తీశారు. ఆ తర్వాత యువతి ఫోన్ నంబర్ తెలుసుకుని ఆ వీడియోను ఆమెకు పంపించారు. దీంతో బెదిరిపోయిన యువతి ఆ వీడియో డిలీట్ చేయాలని కోరగా వారు తమ కోర్కెను బయటపెట్టారు. తాము చెప్పిన చోటికి ఆమెను రప్పించి సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు.

ఓ రోజు బాధితురాలికి వీడియో కాల్ చేసిన ఆ ముగ్గురు తమతో న్యూడ్ చాట్ చేయాలని వేధించారు. దీంతో భయపడిపోయిన ఆమె నిద్రమాత్రలు మింగేసింది. హాస్టల్ నిర్వాహకుల సమాచారంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందని వారు ఆరా తీయగా విషయం మొత్తం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విజయ్‌కుమార్, శంకర్‌ను అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు వరదరాజన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *