షాక్: ఓం నమో వెంకటేశాయ’ ప్రీ రిలీజ్ బిజినెస్

హైదరాబాద్ : దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై మంచి భక్తులను అలరిస్తున్నాయి. ఫిబ్రవరి 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవారి భక్తుడు హథీరాం బాబాగా నాగార్జున, కృష్ణమ్మ అనే భక్తురాలిగా అనుష్క నటించారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం పలు భారీ సెట్లు నిర్మించి చిత్రీకరణ జరిపారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ని రీసెంట్ గా క్లోజ్ చేసినట్లు సమాచారం. ఎవరూ ఊహించని స్థాయిలో బిజినెస్ చేసి. చరిత్ర సృష్టించింది.

ఆశ్చర్యపోయే స్దాయిలో అందుతున్న ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.47.25 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. భక్తి చిత్రాల్లో ఈ రేంజులో బిజినెస్ చేయడం ఇదే తొలిసారి. దాంతో అందరూ ఈ లెక్కలు చూసి ఆశ్చర్యపోతున్నారు.

భారీ రేట్లకు

అంతేకాదు…నాగ్ కెరీర్లో కూడా ఇది రికార్డ్ ఫిగర్, ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ తర్వాత నాగార్జున, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో చాలా నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు దీని రైట్స్ భారీ రేట్లకు కొనుగోలు చేశారు.

నైజాం ఏరియా ఎంతకంటే..

ముఖ్యంగా లెక్కలు వేసి మరీ సినిమాలు కొనే ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నైజాం ఏరియా హక్కుల్ని 9 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషంగా చెప్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని ఏరియాలతోపాటు కర్ణాటక, ఓవర్ సీస్ కలుపుకుంటే ఓవరాల్ గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 34 కోట్లకు అమ్ముడుపోయాయి.

మొత్తం ఇంత…

ఈ చిత్రం సేఫ్ జోన్లోకి చేరాలంటే రూ.35 కోట్లపైనే వసూలు చేయాల్సి వుంటుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులతోపాటు ఆడియో రైట్స్ కూడా కలుపుకుంటే. టోటల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్క రూ.47.25 కోట్లు.

ఏరియాలవారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు :

నైజాం : 9(దిల్ రాజు) సీడెడ్ : 4.01 వైజాగ్ : 2.87 గోదావరి : 3.62 కృష్ణా : 1.80 గుంటూరు : 2.25 నెలల్లారు : 1.10 ఏపీ+తెలంగాణ : రూ. 24.65 కోట్లు కర్ణాటక : 2.70 రెస్టాఫ్ ఇండియా : 0.80 ఓవర్వీస్ : 5,50 టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 33.65 కోట్ల ఆడియో+డిజిటల్ : 1.1 శాటిలైట్ : 12.5 గ్రాండ్ టోటల్ : రూ. 47.25 కోట్లు

కుల వివాదం

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు కుల వివాదంలో చిక్కుకుంది. న‌మోః వేంక‌టేశాయ‌కు బంజారా సామాజికవర్గ ప్రజల సెగ తగిలింది. ఈ సినిమాను హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా తీసినప్పుడు ఆయన పేరు పెట్టకుండా.. భగవంతుడి పేరు ఎలా పెడతారని బంజారాలు ప్రశ్నిస్తున్నారు.

టైటిల్ మార్చాల్సిందే

రాఘవేంద్రరావు గతంలో తెరకెక్కించిన అన్నమయ్య, శ్రీ రామదాసు చిత్రాలకు వారి పేర్లనే పెట్టారని… ఈ సినిమాను మాత్రం భగవంతుడి పేరుతో తెరకెక్కించడం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. త‌క్ష‌ణ‌మే న‌మోః వేంక‌టేశాయ పేరును హథీరాంబాబాగా మార్చాలని, లేకుంటే సినిమా రిలీజ్ అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *