నాగార్జున ఓం నమో వెంకటేశాయ లీక్
టాలీవుడ్లో పెద్ద సినిమాలు, క్రేజీ సినిమాలకు రిలీజ్‌కు ముందే లీకేజీ బెడద పట్టుకుంది. అత్తారింటికి దారేది నుంచి బ్లాక్‌బస్టర్ మూవీ బాహుబలి, తాజాగా బాహుబలి 2, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల్లోని సీన్లు ముందే లీక్ అయిపోయాయి. ఇక ఇప్పుడు నాగార్జున భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ సినిమా వంతు వచ్చింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని సీన్లు కూడా లీక్ అయ్యాయి.
బాహుబలి-2 సినిమా క్లిప్పింగ్‌లను చోరీ చేసి.. షేర్ చేసిన కేసులో బెజవాడ పోలీసులు ఆరుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు సెల్ఫోన్లతోపాటు ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరి వద్ద నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ సినిమా క్లిప్పింగ్‌లు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.