అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్బంగా

అమ్మ మాటే మాతృభాష అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశం, మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21నే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 21న నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ 1999 నవంబరు 17న ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తోంది. అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో ఇటీవలే అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే రిపోర్టు 2018ను విడుదల చేసింది.  గత 8 ఏళ్లలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 79.5 శాతం పెరగడం. భారతీయ భాషల్లో ఇదే అత్యధికంగా వృద్ధిచెందు తున్న తెలుగు భాష మనదే!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *