కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా …..

కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటాలని టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 17తో సీఎం కేసీఆర్ 66వ పడిలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘హరిత హారం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మొక్కలు నాటాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. అయితే  మ అభిమాన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తానంటూ ఓ నాయీ బ్రాహ్మణుడు ప్రకటించాడు. కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ఏర్పాటు చేసిన బ్యానర్ ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతోంది. ఆ ఆఫర్ ప్రకటించిన సెలూన్ షాపు యజమాని.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధికి చెందినవారుగా తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *