వారం పాటు అది లేకుండానే ఉందట..!

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘రంగస్థలం 1985’ . గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న అచ్ఛమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ పాత్ర‌ను చెర్రీ ఈ సినిమాలో చేస్తున్నారు.

అలాగే సమంత కూడా ఇప్పటివరకూ కనిపించని గెటప్‌లో ఫ్యాన్స్‌ని ఫిదా చెయ్యడానికి రెడీ అయిపోతోంది. ఇక విభిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ చిత్రాన్ని కూడా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉండేలా, అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసేలా అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు.

సినిమా సెట్స్ పై ఉండగానే సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే..ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిజీగా ఉన్న సమంత సినిమా కోసం చాలా త్యాగాలు చేస్తోంది.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగింది. కనీస వసతులు కూడా లేని ఈ ప్రాంతంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా రామ్ చరణ్, సమంతలు ఎలాంటి కంప్లైంట్ చేయకుండా షూటింగ్ చేశారు.

షూటింగ్ లొకేషన్ లో సమంత స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా షూటింగ్ కు సంబంధించి సమంత చేసిన ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. ‘వారం పాటు ఫోన్ లేకుండా.. అంత ఇబ్బందిగా లేదు.. నేను మరోసారి కూడా ఇలా ఉండగలను..?’ అంటూ ట్వీట్ చేసింది. ఇక తెలుగు తమిళ భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న సమంత అక్టోబర్ లో నాగచైతన్నతో పెళ్లికి కూడా రెడీ అవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *