ఈ ఏడాది ఇదే బెస్ట్ క్రికెట్ ముమెంటేమో..!

యూరప్‌లో నిర్వహించిన టీ10 లీగ్‌లో రొమేనియాకు చెందిన క్రీడాకారుడు వేసిన బౌలింగ్‌ విధానం క్రికెట్‌ అభిమానులనే కాదు నెటిజన్లను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రస్తుతం అతని బౌలింగ్‌ యాక్షన్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. యూరోపియన్‌ యూనియన్‌ టీ10 క్రికెట్‌ లీగ్‌లో రొమేనియా బౌలర్‌ పావెల్‌ ఫ్లోరిన్‌ తన బౌలింగ్‌తో సోషల్‌ మీడియా సెన్సేషనల్‌గా మారిపోయాడు. అతడేమీ చండప్రచండంగా బంతులు విసిరి.. బ్యాట్స్‌మెన్‌ను బెదరగొట్టి వికెట్లు తీయలేదు. పరిగెత్తుకొని వచ్చి.. చాలా నెమ్మదిగా మొత్తం గాలిలోకి బంతిని విసిరేస్తున్నాడు ఈ బౌలర్‌. అసలు బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా.. విచిత్రమైన బౌలింగ్‌ శైలితో వికెట్లకు దూరంగా ఫుల్‌టాస్‌ బంతిని విసురుతున్నాడు.

విషయానికి వస్తే యూరప్‌లో జరుగుతున్న టీ10 లీగ్‌లో క్లజ్‌ క్రికెట్‌ క్లబ్‌, డ్రూక్స్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా క్లజ్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్టు తరపున పెవెల్‌ ఫ్లోరిన్‌ అనే ఆటగాడు బౌలింగ్‌ వేయడం ప్రారంభించాడు. మొదటి బంతిని వేస్తుండటంతోనే అతని బౌలింగ్‌ యాక్షన్‌ గమనించిన ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.అతని బౌలింగ్‌ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఇదేమీ బౌలింగ్‌ యాక‌్షన్‌రా బాబు అని కామెంట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ఇదే బెస్ట్‌ క్రికెట్‌ మూమెంట్‌ అయి ఉంటుందని, ఇతని బౌలింగ్‌ యాక్షన్‌ చూస్తే.. కితకితలు ఖాయమని నెటిజన్లుఅంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *