” కాట‌మ‌రాయుడు ” కు ఫ‌స్ట్ డే రికార్డు క‌లెక్ష‌న్లు

సర్దార్ గబ్బర్‌సింగ్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత పవన్ నుంచి వచ్చిన కాటమరాయుడు. ఏపీ, తెలంగాణ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, నార్త్‌తో పాటు కాట‌మ‌రాయుడు ఓవ‌ర్సీస్‌లో సైతం గ‌తంలో ఏ తెలుగు సినిమా రిలీజ్ కాన‌న్ని స్క్రీన్ల‌లో 300 చోట్ల రిలీజ్ అయ్యింది. సినిమా ప‌ర్లేద‌న్న టాక్ తెచ్చుకోవ‌డంతో పాటు సోలోగా భారీ థియేట‌ర్లలో రిలీజ్ కావ‌డంతో కాట‌మ‌రాయుడుకు అదిరిపోయే ఓపెనింగ్స్ వ‌స్తున్నాయి.

ప్రీమియర్ షోల ద్వారా గురువారం రాత్రే అమెరికాలో కాటమరాయుడు సందడి చేశాడు. విడుదలకు ముందే కాటమరాయుడు పంచెకట్టుతో ఎన్నారైలు కూడా అమెరికాలో తెగ హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రేడ్ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం కాట‌మ‌రాయుడు కేవ‌లం ప్రీమియ‌ర్ షోల ద్వారానే అమెరికాలో 6 లక్షల 15 వేల 853 డాలర్లను కలెక్ట్ చేసినట్లు సమాచారం. అంటే అక్షరాలా 4.10 కోట్ల రూపాయలన్నమాట.

ఓవర్సీస్‌లో ఈ సినిమా హక్కులను సినీగెలాక్సీ దాదాపు 11.5 కోట్ల రూపాయలకు కొంది. అంటే 2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌డితే త‌ప్ప కాట‌మ‌రాయుడు ఓవర్సీస్‌లో గ‌ట్టెక్క‌డు. అయితే ప్రీమియ‌ర్ల‌తోనే రూ. 4 కోట్లు కొల్ల‌గొట్టేయ‌డంతో ఫ‌స్ట్ వీకెండ్‌కే అక్క‌డ 1.5 మిలియ‌న్ డాల‌ర్లు రాబ‌ట్టేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని తెలుస్తోంది.

మ‌రో రెండు వారాల పాటు రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలు కూడా లేకపోవడం కాటమరాయుడికి శుభపరిణామం అని విశ్లేషిస్తున్నారు. మరి ఈ సినిమా ద్వారా కలెక్షన్లలో కాటమరాయుడు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచిచూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *