పవన్ రెండు విధాలా అదరగొట్టేశాడు

ప్రతి హీరోకూ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఒక స్టయిల్ ఉంటుంది. దానికి తగ్గట్లే పాత్రలు.. సినిమాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చూస్తే ఆయనలో మోడర్న్ లుక్ కనిపిస్తుంది. అర్బన్ స్టోరీలే ఆయనకు బాగా సూటవుతాయనిపిస్తుంది. అందుకే కెరీర్ ఆరంభం నుంచి ఆ టచ్ ఉన్న క్యారెక్టర్లు.. సినిమాలే చేస్తూ వస్తున్నాడు పవన్. ఇప్పటిదాకా కెరీర్లో ఒక్క ‘అన్నవరం’ మినహాయిస్తే పవన్ రూరల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలే చేయలేదు. ‘అన్నవరం’లో పాత్ర పవన్ కు అంత బాగా ఏమీ సూటవ్వలేదు కూడా. ఆ సినిమా ఫలితమేంటో కూడా తెలిసిందే.

ఐతే పవన్ ఇప్పుడు పూర్తి స్థాయి రూరల్ స్టోరీతో వస్తున్నాడు. ‘కాటమరాయుడు’ గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా. ఇది తమిళ హిట్ ‘వీరం’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తిగా విలేజ్ లోనే సాగుతుంది. తెలుగులో ఎన్ని మార్పులు చేసినా నేపథ్యం మాత్రం మారలేదని ఈ సినిమా పోస్టర్లు చూస్తేనే అర్థమవుతోంది. పవన్ దాదాపుగా పంచెకట్టులోనే కనిపిస్తున్నాడు. కొన్ని చోట్ల మాత్రమే ప్యాంట్ వేసినట్లున్నాడు. ఐతే ఇప్పటిదాకా పవన్ ఇలాంటి అవతారంలో కనిపించలేదు కాబట్టి అతను ఆ తరహా ఆహార్యానికి సరిపోడేమో అనుకున్నారు కానీ.. ఈ లుక్ లోకి మారాక కానీ పవన్ కు ఆ డ్రెస్సింగ్ అదీ ఎంత బాగా సూటవుతుందో అర్థం కాలేదు.

ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ పంచె కట్టులో భల్లెం పట్టుకుని వస్తున్న పోస్టర్ ఒకటి వదిలారు. అది సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది. అదే సమయంలో పవన్ ఈ చిత్రంలో ఒక పాట కోసం మోడర్న్ లుక్ లో జీన్స్ టీషర్ట్ వేసుకుని నడిచొస్తున్న పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. అది కూడా బాగుంది. మొత్తానికి ఇటు పల్లెటూరి లుక్.. అటు సిటీ లుక్.. రెండింట్లోనూ పవన్ అదరగొట్టేశాడు. మరి సినిమాలో పవన్ ఇంకెలా మెప్పిస్తాడో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *