భారీ రేటుకు పవన్‌ సినిమా నైజాం రైట్స్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థలో రాధాకృష్ణ, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ పుట్టినరోజున కోలవెరీ ఢీ ఫేమ్ అనిరుథ్ రవిచంద్రన్ విడుదల చేసిన చిన్న సాంగ్ బిట్‌ పవన్‌ అభిమానులను కట్టిపడేసింది.

టాలీవుడ్‌లో హిట్ ఫ్లాపులతో సంబంధం లేని ఇమేజ్ పవర్ స్టార్ సొంతం.. ఈ విషయాన్ని పవర్ స్టార్ మరో సారి నిరూపించాడు. గత రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను నిరాశ పరిచినా వాటి ప్రభావం తాజా చిత్రంపై ఏమాత్రం లేదు. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం.  నైజాం హక్కులు, నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిందని టాలీవుడ్‌ టాక్‌. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు 29 కోట్లకు నైజాం రైట్స్‌ను సొంతం చేసుకున్నారట. అలాగే శాటిలైట్ హక్కులను ప్రమఖ చానెల్‌ 19.5 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. దీంతో పవన్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. అలాగే ఖుష్బూ, ఇంద్రజ, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *