దీన్ని చూశాక ఎవరైనా గెలుపుపై ఆశలు పెట్టుకోగలరా?: మోడీ ప్రశ్న

లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు (సోమవారం) ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో పరివర్తన్ ర్యాలీలో పాల్గొని, ప్రసంగించనున్నారు. ప్రస్తుతం సమాజ్‌వాది పార్టీలో ముసలం ఉంది. ఈ నేపథ్యంలో మోడీ ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

– నా జీవితంలో ఇంత పెద్ద సభ చూడలేదు. ఇలంటి సభలో మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నా. లక్నో జన సంద్రాన్ని చూశాక ఏ పార్టీ అయినా విజయం పైన ఆశలు పెట్టుకోగలదా? – 14 ఏళ్లుగా యూపీలో అభివృద్ధి లేదు. మొత్తం కుంటుపడింది. బీజేపీ గెలిస్తే వాటికి చెక్ చెబుతుంది. – బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలు కష్టాలు పడకుండా చేస్తుందన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ యూపీని కాపాడేందుకు ఉందన్నారు. – యూపీని రక్షించే ఒకే ఒక పార్టీ బీజేపీ అన్నారు. యూపీ భవిష్యత్తు బీజేపీతోనే మారుతుందన్నారు. – దేశం అభివృద్ధి కావాలంటే ముందు ఉత్తర ప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలన్నారు. దేశ ప్రజలే దేశ ప్రధానికి హైకమాండ్ అన్నారు. – కుటంబం కోసం పాకులాడే పార్టీలు రాష్ట్రాన్ని కాపాడుతాయా అని సమాజ్ వాది పార్టీలోను ముసలాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. – సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ బీజేపీ నినాదం అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *