‘RRR’లో గెస్ట్ రోల్‌లో నటించనున్న ప్రభాస్?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్‌లతో భారీ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్లు, ప్రతి నాయకుడు తదితర పాత్రలకు సంబంధించి నేటికీ క్లారిటీ లేదు. ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్‌లో అడుగుపెట్టినప్పటికీ హీరోల మినహా ఇతరత్రా నటీనటులపై చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
సినిమాకు హైప్ క్రియేట్ చేసుకోవడంలో రాజమౌళికి రాజమౌళియే సాటి అన్న విషయం ‘బాహుబలి’తోనే నిరూపణ అయ్యింది. ప్రస్తుతం ‘RRR’కు కూడా హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారట రాజమౌళి. తన సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను కూడా భాగం చేయనున్నారనే రూమర్ బాగా వినిపిస్తోంది. ఓ గెస్ట్ రోల్‌లో ప్రభాస్‌ను నటింపజేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది నిజమైతే మాత్రం.. ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాల్లో ఇదే భారీ మల్టీస్టారర్ అవుతుంది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *