తనని పెళ్లి చేసుకోమని అడుగుతా :ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎక్కడికి వెళ్ళిన అనుష్కతో డేటింగ్లో ఉన్నారా? మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? అనే ప్రశ్నలు మీడియా, అభిమానుల నుంచి ఎక్కువగా ఎదురయ్యేది. దాంతో ఆయన స్పందిస్తూ.. ‘ఈ వదంతులకు ఫుల్స్టాప్ పడాలంటే అనుష్క అయినా త్వరగా పెళ్లిచేసుకోవాలి. లేదా నేనన్నా ఓ ఇంటివాడిని అవ్వాలి. ఈసారి అనుష్కను కలిస్తే త్వరగా ఎవర్నో ఒకరిని చూసుకుని పెళ్లిచేసుకోమని చెబుతాను. అని అన్నారు. అప్పుడే మా ఇద్దరి మధ్య ఇలాంటి వదంతులు రాకుండా ఉంటాయి. విషయానికి వస్తే ‘సాహో’ సినిమా ప్రచార కార్యక్రమంలో ప్రభాస్‌కు తాజాగా మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది. దాంతో ఆయన ఈ విధంగా అన్నారు. అనుష్క, ప్రభాస్ కేవలం స్నేహితులమేనని ప్రభాస్ ఇప్పటికి వంద సార్లు చెప్పుంటారు. అయినా ఈ ప్రశ్నలకు, వదంతులకు ఫుల్స్టాప్ పడటం లేదు. మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మాకు నిజం దాచాల్సిన అవసరం ఏంటి? అసలు ఇలాంటి రూమర్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. బహుశా నాకు త్వరగా పెళ్లి చేయాలని ప్రజలు అనుకుంటున్నారేమో. అందుకే ఇలాంటి లింక్స్ పెడుతున్నారని అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు ప్రభాస్.