ప్రభాస్ పెళ్లి ఆమెతోనా?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే టక్కున గుర్కొచ్చే పేరు ప్రభాస్. తాజాగా సాహో సినిమా రిలీజ్కు రెడీ అవుతుండటంతో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ప్రభాస్ గాని ఆయన పీఆర్ టీం గాని ఇంతవరకు స్పందించలేదు.
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ త్వరలో సాహో సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. సాహో సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.