బడ్జెట్‌లో ప్రాధాన్యతా అంశాలు

న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నరేంద్ర మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌ ఇది. * రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి పలు సంస్కరణలను చేశారు.*2019-20 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ జీడీపీలో ద్రవ్యలోటుకు 3.3శాతం కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌ (2020-21)ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంశంలో ప్రభుత్వం సరళీకృత విధానం అవలంభించే అవకాశాలు ఉన్నట్లు బడ్జెట్‌ స్పష్టం చేస్తుంది.
*ప్రభుత్వం కాలుష్య నివారణ, డిజిటల్‌ ఇండియా, మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ, నదులను శుభ్రపరచడం తదితర అంశాలకు బడ్జెట్‌ ప్రాధాన్యత ఇచ్చింది.
*ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తు ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండించడంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా కృషి చేస్తున్నట్లు బడ్జెట్‌ స్పష్టం చేస్తుంది *దేశం బాగుండాలంటే అందరి ఆరోగ్యాలు బాగుండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ను మరింత మెరుగుపరుచే విధంగా కృషి చేసస్తామని బడ్జెట్‌ స్పష్టం చేస్తుంది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా మహిళలు, శిశువులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. *బడ్జెట్‌లో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, రక్షణ శాఖ, తయారీ రంగం, ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, వైద్య పరికరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *