ప్రైవేటు రైళ్లు నగరానికి….

సికింద్రాబాద్‌ నగరం నుంచి ప్రైవేటు రైళ్ళు  ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, ఇతర రాష్ట్రాల మధ్యకి  ఈ సంవత్సరంలోనే రైళ్లను నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు తొమ్మిది మార్గాల్లో ప్రైవేటు రైళ్లు మంజూరయ్యాయి. వాటిలో ఏడు రైళ్లు నగరానికి మంజూరు కావడం రైళ్ల నిర్వహణ, భద్రత, గార్డుల నియామకం, ట్రాక్‌ నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలు రైల్వే ఆధీనంలో ఉంటాయని ఆయన తెలిపారు. రైళ్లలో కేటరింగ్‌ తదితర అంశాలు ప్రైవేటు చేతుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయని, చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టినట్టు చెప్పుకోవచ్చు. రైల్వే శాఖ ప్రకటించిన 9 ప్రైవేటు రైళ్లలో 7 రైళ్లు నగరానికి సంబంధించినవి కాగా, వాటిలో 5 రైళ్లు చర్లపల్లి నుంచి బయల్దేరనుండడం విశేషం. చర్లపల్లి నుంచి వారణాసి, పన్వేలి, శాలిమార్‌, చెన్నై, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు. జంటనగరాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లుగా ఉన్న సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడం, శివారు స్టేషన్లను అభివృద్ధి చేయడం కోసం నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. శివార్లలోని ఇతర స్టేషన్లతో పోలిస్తే చర్లపల్లి రైల్వే స్టేషన్‌ బాగా అభివృద్ధి చెందుతుండడం, తాజా బడ్జెట్‌లో చర్లపల్లి టెర్మినల్‌ అభివృద్ధి పనులకు గాను రూ. ఐదు కోట్లు కూడా మంజూరు చేశారు. ప్రైవేటు రైళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పట్టాలెక్కిస్తామని రైల్వే శాఖ చెబుతున్న నేపథ్యంలో చర్లపల్లి టెర్మినల్‌ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి కావచ్చన్న ఆశలు వస్తున్నాయి. ఈ టెర్మినల్‌ అభివృద్ధి జరిగితే పలు రైళ్లను ఇక్కడి నుంచి నడిపే వెసులుబాటు కలుగుతుంది.

రైల్వే శాఖ ప్రకటించిన జాబితాలో లింగంపల్లి రూట్‌ కూడా ఉంది. లింగంపల్లి-తిరుపతి మార్గంలో కూడా ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడంలో భాగంగా కొద్ది కాలంగా లింగంపల్లి స్టేషన్‌కు దక్షిణమధ్యరైల్వే యంత్రాంగం ప్రాధాన్యం ఇస్తోంది. అమరావతి సచివాలయ ఉద్యోగుల కోసం నడిపిస్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రె్‌సను లింగంపల్లి వరకు పొడిగించిన విషయం విధితమే. తాజాగా లింగంపల్లి నుంచి తిరుపతికి కూడా ప్రైవేటు రైళ్లు ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయంతో లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్టయింది.ఇంకా రెండు తేజస్‌ రైళ్లు వచ్చే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా పేర్కొన్నారు. గుంటూరు-లింగంపల్లి, ఔరంగాబాద్‌-పన్వెలి మార్గాల్లో ఇంటర్‌ సిటీ రైళ్లు ప్రవేశపెట్టవచ్చని ఆయన చెప్పారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టు కోసం తాజా బడ్జెట్‌లో రూ. 40 కోట్లు కేటాయించింది. 2018- 19 లో 20 కోట్లు, 2019-20లో రూ. 10లక్షలే కేటా యిం చగా, ఈ బడ్జెట్‌లో రూ. 40 కోట్లు కేటాయించడం తో ప్రాజెక్టు పూర్తవుతుందనుకుంటున్నారు.

రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాలంటూ గతంలో సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందిస్తూ రైల్వే శాఖ 2016-17లో ఘట్‌కేసర్‌-యాదాద్రి (రాయ్‌గిర్‌) వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తున్న ట్టు ప్రకటించారు. దీనిని ఎంఎంటీఎస్‌ మూడో దశ గా పేర్కొన్నారు. 33 కిలోమీటర్ల మేరకు చేపట్టను న్న ఎంఎంటీఎస్‌ మూడో దశ కోసం రూ. 330 కోట్లు వ్యయమవుతుందని తొలుత అంచనా వేశారు. ఇందులో 2/3వంతు రాష్ట్ర ప్రభుత్వం, 1/3వం తు రైల్వే భరించాల్సి ఉంది. ప్రస్తుతం అంచనా వ్యయం రూ. 412 కోట్లకు పెరిగింది. మూడో దశ పనుల నిమిత్తం గతంలో రూ. 20 కోట్లు కేటాయిం చగా, తాజా బడ్జెట్‌లో రూ. 10 లక్షలు మాత్రమే కేటాయించింది. ఈ బడ్జెట్‌లో నగరం నుంచి కొత్త రైళ్లు వస్తాయని ఆశించిన ప్రయాణికులకు నిరాశే మిగిలింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *