ఆ తప్పు చేస్తే తప్పేంటి..?

అసలు అది తప్పే కాదు. ప్రకృతి సహజం. నాకు అది ఎప్పుడూ తప్పు అనిపించదు”. సెక్స్ పై ప్రియాంక చోప్రా హాట్ కామెంట్స్ ఇవి. ఇదే పెద్ద హాట్ అనుకుంటే ఇంతకంటే ఘాటైన కామెంట్ చేసింది. మందు, సిగరెట్ కంటే సెక్స్ చేయడం చాలా బెస్ట్ అంటోంది. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. కానీ సెక్స్ మాత్రం మానసిక ఉల్లాసం అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చేసింది.

ఈమె నటించిన బేవాచ్ సినిమా హాలీవుడ్ లో రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రియాంక పెర్ఫార్మెన్స్ కు క్రిటిక్స్ పాస్ మార్కులు కూడా వేయలేదు. కానీ ఆమె స్కిన్ షోను మాత్రం కొందరు మెచ్చుకున్నారు. సరిగ్గా ఈ పాయింట్ నే హైలెట్ చేసుకునే పనిలో పడింది ప్రియాంక. పోస్ట్-రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ఈ బేవాచ్ బ్యూటీ.. ఉన్నవి చూపించడానికే కదా అని చెప్పి గలగలా నవ్వేసింది.

ఇండియా నుంచి వచ్చిన ఓ అమ్మాయి ఈ రేంజ్ లో స్కిన్ షో చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ వచ్చిన రివ్యూస్ పై ప్రియాంక తనదైన స్టయిల్ లో రియాక్ట్ అయింది. తనకంటే బాగా ఎక్స్ పోజింగ్ చేసే హీరోయిన్లు చాలామంది ఇండియాలో ఉన్నారని, కాకపోతే హాలీవుడ్ స్క్రీన్ పై మెరిసే అవకాశం మాత్రం వాళ్లకు దక్కలేదని అంటోంది.

ఇకముందు కూడా ఈ రేంజ్ లోనే ఎక్స్ పోజింగ్ చేస్తారా అనే ప్రశ్నకు “క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అంతకుమించి” అంటూ సమాధానమిచ్చింది ప్రియాంక. ఈ ఒక్క ఆన్సర్ చాలు ఆమెకు మళ్లీ మరో హాలీవుడ్ ఛాన్స్ రావడానికి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *