సజీవంగా తగులబెట్టాలని ప్రియాంకరెడ్డి తల్లి విజయమ్మ

ప్రియాంక హత్య కేసులో షాద్ నగర్ జిల్లా బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులకు ఎవరూ న్యాయ సహాయం చేయకూడదని తీర్మానించారు. నిందితులకు కఠిన శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.  ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితుకుల ఉరి శిక్ష పడేలా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలంలో రూపొందించిన చట్టాలకు త్వరలోనే మార్పులు చేయబోతున్నట్టు తెలిపారు.  అలాగే మహిళల రక్షణ కోసం112 ప్రత్యేక యాప్‌లను రూపొందించామని, ప్రతీ మహిళా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.

లోకం పోకడ తెలియని తన పెద్ద కుమార్తెను అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా కూతురు చాలా అమాయకురాలు. అకారణంగా నా బిడ్డను హత్య చేసిన నిందితులను సజీవంగా తగులబెట్టాలని కోరుకుంటున్నాన’ని విజయమ్మ మీడియాతో చెప్పారు. తన కూతురిని అత్యంత పాశవికంగా హత్య చేసిన నలుగురు నేరస్తులను బహిరంగంగా సజీవంగా తగులబెట్టాలని ప్రియాంకరెడ్డి తల్లి విజయమ్మ డిమాండ్‌  ప్రియాంకను హత్య చేసిన నలుగురు నిందితులను జైల్లో పెట్టొద్దని తమకు అప్పగిస్తే నరకం చూపిస్తామని అంటున్నారు. నలుగురు నేరస్తులను ఎన్‌కౌంటర్‌ చేసి చంపాలని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

తాజాగా సినీ నటుడు అలీ దీనిపై స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని.. ప్రియాంక తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు.ఆ తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందన్నారు  ఈ షాద్‌నగర్ లైంగికదాడిపై అంతా సోసల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇప్పుడు ఉపాసన కూడా తన యూట్యూబ్ ఛానెల్ నుంచి ఓ వీడియోను విడదల చేసింది. పిల్లలందరిని కామాంధుల భారిన పడకుండా కాపాడటం ఎలా అనే ఒక అంశంపై ఒక వీడియోని సిద్ధం చేసి.. తన ఛానెల్‌లో విడుదల చేసింది. ప్రజల బాగుకోసమే తనవంతు సాయంగా ఈ పని చేస్తున్నట్లు తెలిపింది మెగా కోడలు. ఇందులో మన సమాజంలో పిల్లలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాల నుంచి వాళ్లను వాళ్లు ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై చాలా విషయాలు పొందుపరిచింది ఉపాసన. మనం ఉంటున్న ఈ సమాజంలోనే అమ్మాయిలపై నీచంగా వ్యవహరించే క్రూరమృగాలు కూడా ఉంటున్నాయని తెలుసుకుని అంతా సిగ్గుతో చచ్చిపోతున్నారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *