పీఎస్‌ఎల్వీసీ-48 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది

రాకెట్ నింగిలోకి
శ్రీహరికోట ప్రయోగం కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీసీ-48 రాకెట్ 23 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ప్రారంభమైన 23 గంటల సాగుతోంది. వాస్తవానికి ఈ కౌంట్‌డౌన్ సాయంత్రం 4.25 నిమిషాలకు ప్రారంభించాల్సి ఉండగా, 4.30 వరకు రాహుకాలం ఉండటంలో 4.40 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 3.25 గంటలకు వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం కావడం విశేషం. ఈ వాహకనౌక ద్వారా కీశాట్‌2 బీఆర్‌ 1 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. అంతేకాదు, చంద్రయాన్-2 తర్వాత నిర్వహించిన రెండో ప్రయోగం ఇది.ఈ ప్రయోగం తర్వాత అంతరిక్షం నుంచే అవకాశం లభిస్తుంది. శత్రుదేశాల రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎక్కడున్నాయో గుర్తించడం, శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం, చిత్రాలను అందజేస్తుంది. గతంలో ఈ పనిచేయడానికి డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఇమిశాట్‌ రాకతో 24 గంటలు నిఘావేసే అవకాశం దక్కింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *