యూస్ ఓపెన్ విన్నర్ రఫెల్ నాదల్
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిల్ బుల్ రఫెల్ నాదల్ గెల్చుకున్నాడు. హోరా హోరీగా జరిగిన తుది పోరులో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో ఓడించి విజేతగా నిలిచాడు. ఈ విజయంతో కెరీర్లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి రెండు సెట్లు రాఫెల్ గెలిచినప్పటికీ మెద్వెదేవ్ కుంగిపోకుండా మొండి ధైర్యంతో పోరాడు. మూడు, నాలుగు సెట్లను దక్కించుకుని నాదల్కు చెమటలు పట్టించాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో రాఫెల్ విజృంభించడంతో మెద్వెదేవ్ ఓటమి పాలయ్యాడు. నాలుగు గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ క్రీడాభిమానులను ఆకట్టుకుంది.