అనుష్క గొప్ప నటేమీ కాదు-రాజమౌళి

‘అరుంధతి’.. ‘రుద్రమదేవి’.. లాంటి సినిమాల్లో చాలా బాగా నటించి మెప్పించింది అనుష్క. ఈ పాత్రలకు తెలుగు హీరోయిన్లలో ఇంకెవరినీ ఊహించుకోలేం. ‘బాహుబలి’లో దేవసేన పాత్రలోనూ తన ప్రత్యేకత చాటుకుంది అనుష్క. అయినప్పటికీ అనుష్క అంత గొప్ప నటి అని తాను భావించనని మొహమాటం లేకుండా చెప్పాడు రాజమౌళి. అనుష్కలో నటన కంటే కూడా వేరే అంశాలు తనను ఎక్కువ ఆకట్టుకుంటాయని.. నటన విషయంలో ఆమె నుంచి అంత ఎక్కువేమీ ఆశించనని.. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ వరకు అనుష్క తాను ఆశించిన దాని కంటే బాగానే చేసిందని రాజమౌళి చెప్పాడు.

‘‘అనుష్కలో ప్రొఫెషనలిజం నాకు ఎంతో నచ్చే విషయం. ఆమెకు ఎవరితో ఎలా మెలాగోలో తెలుసు. సినిమా కోసం ఎంత కష్టపడాలో తెలుసు. తన పనిని ఎంత బాధ్యతతో చేయాలో తెలుసు. తన వల్ల కానిది కూడా చేయాలని తపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటుంది. ఏం చేయాలో చెప్పండి.. చేస్తా అంటుంది. ఆమె మంచి మనిషి. ఇక ఆమె ఆహార్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి రూపం ఇంకెవరికీ లేదు. రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. అందుకే దేవసేన పాత్రకు ఆమె తప్ప నాకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఐతే నటన పరంగా నేను ఆమెకు గొప్ప రేటింగ్ ఏమీ ఇవ్వను. ఆ విషయంలో ఆమె మీద నాకు మరీ ఎక్కువ అంచనాలేమీ లేవు. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అవతల రమ్యకృష్ణ లాంటి గొప్ప నటి ఉంది. అలాంటి నటితో ఆమె ఎదురు నిలబడి నటించి మెప్పించింది. ఇంకా సత్యరాజ్ – నాజర్ – రానా – ప్రభాస్.. ఇలాంటి వాళ్ల ముందు ఆత్మవిశ్వాసంతో నటించడం చూసి ఆశ్చర్యపోయాను’’ అని రాజమౌళి అన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *