దయచేసి బాహుబలిని అడ్డుకోవద్దు.. కన్నడ ప్రజలకు రాజమౌళి కన్నడ స్పీచ్

ధర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా బాహుబలి 2. కన్నడ ప్రజలకు రాజమౌళి విజ్ఞప్తి చేశారు. దయచేసి బాహుబలి సినిమాను అడ్డుకోవద్దని తన ట్విట్టర్ ద్వారా కోరారు. ఈ మేరకు కన్నడ భాషలో విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయితే కావేరి జలాల వివాదంపై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, అతను చేసిన వ్యాఖ్యలకు బాహుబలి సినిమాకు సంబంధం లేదని తెలిపారు. అతను చేసిన వ్యాఖ్యలను పట్టుకుని బాహుబలి 2 సినిమాను అడ్డుకుంటే తాము తీవ్రంగా నష్టపోతామంటూ వీడియోలో వెల్లడించారు రాజమౌళి. ఈ సందర్భంగా తమ దయచేసి తమ సినిమాను అడ్డుకోవద్దంటూ కన్నడ సంఘాలను కోరారు.

కావేరి జలవివాదం విషయంలో కన్నడ ప్రజలను అవమానించే విధంగా సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో కన్నడ సంఘాల నేతలు ఇకపై సత్యరాజ్ నటించిన సినిమాలను కర్నాటలో విడుదల కాకుండా అడ్డుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాహుబలి 2 ను అడ్డుకుంటున్నారు. ఇప్పటికే బెంగళూరులో బాహుబలి పోస్టర్లను ఆందోళనకారులు తగలబెట్టారు. ఓ వైపు సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుండటంతో నేరుగా దర్శకుడు రాజమౌళి రంగంలోకి దిగి వారి భాషలోనే తమ సినిమాను అడ్డుకోవద్దంటూ కోరారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *