“ బాహుబలి” వీడియోలో “ప్రభాస్” పై పూలు చల్లుతున్న5 మంది ఎవరి పిల్లలో తెలుసా..?
బాహుబలి-2 మోషన్ పోస్టర్ రిలీజ్ నుంచి బ్యాక్ గ్రౌండ్లో వినిపించిన సాహోరే బాహుబలి టైటిల్ సాంగ్ వరకూ ఫుల్ పాపులర్ అయింది. ఇక ఆడియో లాంచ్ అయిన తర్వాత ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రోమోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అదిరిపోయే గ్రాఫిక్స్.. అద్భుతమైన సీన్స్.. రక్తం మరిగించే ఎమోషన్స్ అన్నీ రంగరించిన ఈ ప్రోమో సాంగ్.. వారెవ్వా జక్కన్న అనిపిస్తోంది. దలేర్ మెహందీ, కీరవాణి, మౌనిమ ఆలపించిన సాహోరే బాహుబలి పాటలో ఓ స్పెషాలిటీ ఉంది.
ఈ సాంగ్లో రాజమౌళి కూతురు మయూఖ నటించింది. లేటెస్ట్గా రిలీజ్ అయిన ప్రోమోలో మయూఖ కనిపిస్తోంది. మయూఖ పక్కన ఉన్న ఇద్దరు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి కూతురు, కీరవాణి కూతురు. ముందు వరుసలో ఉన్న ఇద్దరు పిల్లలు సినిమాటో గ్రాఫర్ సెంథిల్ కుమార్ పిల్లలు.