రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు…. (లిస్ట్)

తెలుగు సినిమా రంగంలో అపజయం ఎరుగని దర్శకుడు ఎవరు? అంటే ప్రతి ఒక్కరూ ముందుగా చెప్పే పేరు దర్శకుడు రాజమౌళి. ఎలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారు? ఏ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలి? తాను తీసిన సినిమాకు వసూళ్లు ఎంత వస్తాయి? అని అంచనా వేయడంలో రాజమౌళిని మించిన వారు బహుషా తెలుగు సినిమా పరిశ్రమలో లేరేమో? తన తొలి సినిమా స్టూడెంట్ నెం.1 నుండి…. ప్రస్తుతం ‘బాహుబలి-2’ మూవీ వరకు రాజమౌళి సినీ ప్రస్తానాన్ని పరిశీలిస్తే….. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకున్నవే. అందులో కొన్ని హిట్ సినిమాలు, కొన్ని బ్లాక్ బస్టర్స్, మరికొన్ని ఇండస్ట్రీ హిట్స్.

బాహుబలి సినిమాతో కేవలం తెలుగు సినిమా స్థాయిని మాత్రమే కాదు, ఇండియన్ మూవీ లెవల్ ను ఒక్కసారిగా పెంచేసాడు రాజమౌళి. ఇప్పటి వరకు ఎవరూ అందుకోలేని బ్రహ్మాండంగా ఉన్న రూ. 1000 కోట్ల కలెక్షన్ మార్కను రీచ్ అయి బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టాడు. ఈ సందర్భంగా రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, ఆయా సినిమాలు సాధించిన వసూళ్ల వివరాలపై ఓ లుక్కేద్దాం…

స్టూడెంట్ నంబర్ 1 ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘స్టూడెంట్ నెం.1′ సినిమా ద్వారా రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అప్పట్లో రాజమౌళి ఈ సినిమాను రూ. 3 కోట్ల ఖర్చుతో తీసారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్ రూ. 4 కోట్లకు కొనగా…. బాక్సాఫీసు వద్ద రూ.12 కోట్ల బిజినెస్ చేసింది.

సింహాద్రి రాజమౌళి తన రెండో సినిమా కూడా జూ ఎన్టీఆర్ తోనే చేసాడు. మాస్ ఎంటర్టెనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అప్పట్లో రూ. 8 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు. బయ్యర్లు ఈ చిత్రాన్ని రూ. 13 కోట్లకు కొనగా బాక్సాఫీసు వద్ద రెట్టింపు బిజినెస్ అంటే రూ. 26 కోట్లు వసూలు చేసింది.

సై నితిన్ హీరోగా రాజమౌళి తన మూడో సినిమాగా ‘సై’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అప్పట్లో రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని బయ్యర్లు రూ. 7 కోట్లకు కొనగా బాక్సాఫీసు వద్ద రూ. 10 కోట్ల బిజినెస్ చేసింది.

ఛత్రపతి ప్రభాస్ హీరోగా రాజమౌళి తన 4వ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని అప్పట్లో రూ. 10 కోట్లతో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లు రూ. 13 కోట్లకు కొనగా బాక్సాఫీసు వద్ద రూ. 21 కోట్ల బిజినెస్ చేసింది.

విక్రమార్కుడు రాజమౌళి తన 5వ చిత్రాన్ని రవితేజ హీరోగా ‘విక్రమార్కుడు’ సినిమా చేసారు. ఈ చిత్రాన్ని రూ. 11 కోట్లతో తెరకెక్కించగా 14 కోట్లు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. బాక్సాఫీసు వద్ద ఈచిత్రం దాదాపు రూ. 20 కోట్ల బిజినెస్ చేసింది.

యమదొంగ ఎన్టీఆర్ హీరోగా తన 6వ చిత్రంగా ‘యమదొంగ’ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి ఈ చిత్రాన్ని అప్పట్లో రూ. 18 కోట్లతో రూపొందించారు. ఎన్టీఆర్-రాజమౌళి హిట్ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రాన్ని రూ. 22 కోట్లకు కొన్నారు బయ్యర్లు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 29 కోట్ల బిజినెస్ చేసింది.

మగధీర రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘మగధీర’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్. ఈ చిత్రాన్ని అప్పట్లో రూ. 44 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. అప్పట్లో ఇదే భారీ బడ్జెట్ మూవీ. దీన్ని 48 కోట్లకు విక్రయించగా బాక్సాఫీసు వద్ద 151 కోట్లు బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మర్యాద రామన్న కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ తో రూ. 14 కోట్ల ఖర్చుతో ‘మర్యాద రామన్న’ సినిమా తీసిన రాజమౌళి మరో హిట్ కొట్టారు. ఈచిత్రం రూ. 20 కోట్లకు అమ్ముడవ్వగా బాక్సాఫీసు వద్ద రూ. 29 కోట్ల బిజినెస్ చేసింది.

ఈగ గ్రాఫిక్సే ప్రధానంగా ‘ఈగ’ చిత్రాన్ని రాజమౌళి రూ. 26 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రం రూ. 32 కోట్లకు అమ్ముడవ్వగా…. బాక్సాఫీసు వద్ద రూ.43 కోట్ల బిజినెస్ చేసింది.

బాహుబలి బిగినింగ్ రాజమౌళి తన కెరీర్లో భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో లార్జన్ దన్ లైఫ్ అనేలా మొదలు పెట్టిన ప్రాజెక్టు బాహుబలి. రెండు పార్టులుగా ఈచిత్రాన్ని ప్లాన్ చేసారు. మొదటి పార్టును రూ. 136 కోట్లతో తెరకెక్కించగా థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 191 కోట్లు వచ్చాయి. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 602 కోట్ల బిజినెస్ చేసింది.

బాహుబలి 2 బాహుబలికి సీక్వెల్ గా తెరకెక్కిన బాహుబలి-2 చిత్రాన్ని రూ. 250 కోట్లతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి రూ. 500 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 9వ రోజే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 1000 కోట్ల కొల్లగొట్టింది. ఈ చిత్రం ఓవరాల్ రన్ లో రూ. 1500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *