తారక్ ఇష్టం..సినిమా ఉంటుందేమో-రాజమౌళి

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడనే విషయంలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. చాలా మంది హీరోలు.. నిర్మాతల పేర్లు తెరమీదికి వచ్చాయి. ఈ సారి తెలుగులో కాదు హిందీలో సినిమా చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. ఐతే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి.. తన తర్వాతి సినిమా విషయంలో ఏదీ ఫైనలైజ్ కాలేదని తేల్చి చెప్పాడు. ఐతే ఎన్టీఆర్ తో సినిమా చేయాలన్న ఆసక్తిని మాత్రం ప్రదర్శించాడు రాజమౌళి. గతంలో ఎన్నోసార్లు తారక్ మీద తన ఇష్టాన్ని బయటపెట్టిన రాజమౌళి.. మరోసారి తన తొలి చిత్ర కథానాయకుడి గురించి సానుకూలంగా మాట్లాడాడు.

ఎన్టీఆర్ తో మీ తర్వాతి సినిమా ఉంటుందా అని అడిగితే.. తారక్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఇది ఇంతకుముందు కూడా చెప్పానని.. తన తర్వాతి సినిమా ఎన్టీఆర్ తో ఉండొచ్చని.. ఉండకపోవచ్చని రాజమౌళి అన్నాడు. కథ ఓకే అయ్యాకే ఏదైనా డిసైడ్ చేసుకుంటానని రాజమౌళి తెలిపాడు. తాను ఎప్పుడైనా కథను బట్టే హీరోను ఎంచుకుంటానని రాజమౌళి స్పష్టం చేశాడు. తన తండ్రి ఇప్పటికే తనకు మూడు కథలు వినిపించాడని.. కానీ అవేవీ ఎక్కలేదని తేల్చేశాడు జక్కన్న. తనకు నిర్మాతలు డీవీవీ దానయ్య.. కేఎల్ నారాయణలతో కమిట్మెంట్లు ఉన్న విషయాన్ని కూడా అంగీకరించాడు రాజమౌళి. అలాగే తన మిత్రుడైన సాయి కొర్రపాటికి ఓ సినిమా చేయాల్సి ఉందని.. ఆయనతో సినిమా అంటే తనకు చాలా సౌకర్యంగా ఉంటుందని వెల్లడించాడు రాజమౌళి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *