టీజర్ : రిచ్.. స్టైలిష్.. గరుడవేగ

సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో గరుడ వేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజశేఖర్ కెరీర్ లోనే  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రద్దా దాస్, పూజ కుమార్, కిశోర్, ఆదిత్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ  సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.

ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా గరుడవేగ టీజర్ పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా పేజ్ ల ద్వారా ఒకేసారి విడుల చేశారు. రాజశేఖర్ కౌంటర్ టెర్రరిజం ఫైటర్ గా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో స్టైలిష్ గా తెరకెక్కించారు. ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న గరుడవేగ, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *