రోబో 2.0 హిందీ రైట్స్: రిస్క్ చేయలేమన్న డిస్ట్రిబ్యూటర్స్.. చీప్ గా ఇచ్చేసారా

సూపర్ స్టార్ రజనికాంత్ రోబో 2.0 కొత్త డేట్ వచ్చింది. వచ్చే సంవత్సరం జనవరి 25న ఈ సినిమా విడుదల అవుతుందని అ మేరకు అభిమాన సంఘాలకు, డిస్ట్రిబ్యూటర్లకు అనధికార సమాచారం వెళ్ళింది. యూనిట్ ఇంకా మీడియా కు చెప్పాల్సి ఉంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తీసామని చెబుతున్న  ఈ మూవీపై ఉన్న అంచనాల గురించి రాయాలంటే ఒక పుస్తకం సరిపోదు. రోబో ఫస్ట్ పార్ట్ తోనే మన మతులు పోగొట్టిన శంకర్ దానికి రెండింతలు గొప్ప అనిపించేలా ఈ సినిమా తీసినట్టు వార్త.

సిజె వర్క్ కోసం దాదాపు పది టీంలు శంకర్ ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి. కేవలం గ్రాఫిక్స్ కోసమే పది నెలల టైం కేటాయించుకున్నాడు శంకర్. ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉన్నట్టు తెలిసింది. ఇక బిజినెస్ పరంగా కూడా వ్యవహారాలు స్టార్ట్ చేసింది లైకా సంస్థ. తెలుగులో ఇంకా ఎవరు చేజేక్కించుకుంటారు అనేది ఇంకా తేలలేదు కాని హింది వరకు కానిస్తున్నారు.

హింది కి సంబందించిన థియేటర్ హక్కులని 80 కోట్లకు అమ్మేసారనే వార్త ఇప్పుడు బిజినెస్ సర్కిల్స్ లో హాట్ న్యూస్ గా మారింది. బాహుబలి సాధించిన సక్సెస్, చేసుకున్న మార్కెట్, తెచ్చిన వసూళ్ళ ప్రకారం చూస్తే రోబో చాలా చీప్ గా ఇచ్చినట్టే. ఒక్క హింది వెర్షన్ మాత్రమే బాహుబలి 250 కోట్ల షేర్ కొల్లగొట్టి అల్ టైం రికార్డు సృష్టించింది. పోలిక ప్రకారం చూసుకుంటే ప్రభాస్, రాజమౌళి కన్నా రజినీకాంత్, శంకర్ ల ఇమేజ్ చాలా పెద్దది. మరి రోబో 2.0 ని అంత తక్కువకు ఎందుకు ఇచ్చారు అనేది అంతుచిక్కడం లేదు. అక్షయ్ కుమార్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ ఐనప్పటికీ ఇంత తక్కువ ధర పలకడం ఆశ్చర్యమే.

ఇందులో అక్షయ్ క్రూరమైన విలన్ గా నటిస్తుండగా ఇందులో హీరో పాత్ర తో పాటు హీరొయిన్ అమీ జాక్సన్ పాత్ర కూడా రోబో తరహాలోనే ఉంటుందట. అదే అసలు ట్విస్ట్ అంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో రోబో అయిన రజనికాంత్ మనిషి అయిన ఐశ్వర్యారాయ్ ని ప్రేమిస్తే 2.0 లో మాత్రం రోబో రజనికాంత్ మరో రోబో అమీ జాక్సన్ ని ప్రేమిస్తుందట. పోలా అదిరిపోలా. అందుకే ఆయన్ని శంకర్ అనేది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *