బాలీవుడ్ హీరో ఫై ప్రశంసలు: రజినీకాంత్
స్టార్ రజినీకాంత్ కి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ హీరో తాజాగా హృతిక్ నటించిన బలం చిత్ర ట్రైలర్ ని, పాటలని చూసి ప్రశంసలు కురిపించాడు. ఈ వార్త వినగానే హృతిక్ ఎంతో ఆనందించి రజినీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. రజినీకాంత్, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ల ది 30 సంవత్సరాల గా కొనసాగుతోన్న స్నేహ బంధం.
హృతిక్ రోషన్ తాత గారు జె ఓం ప్రకాష్ తీసిన భగవాన్ దాదా చిత్రం తో వీరిద్దరి బంధం ఏర్పడింది. ఆశక్తి కర విషయం ఏమిటంటే, హృతిక్ రోషన్ కి మొట్ట మొదటి డైలాగ్ ఉన్న చిత్రం ఇదే కావటం. అప్పుడు హృతిక్ వయసు 12 సంవత్సరాలు కావడం విశేషం. హృతిక్ నటించిన కాబిల్ జనవరి 25న విడుదల కాబోతోంది. తెలుగులో ఈ చిత్రం బలం గా వస్తోంది. హృతిక్ , యామి జంటగా నటించిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ను సంజయ్ గుప్తా డైరెక్ట్ చేయగా, రాకేష్ రోషన్ నిర్మించారు. రాజేష్ రోషన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం లో హృతిక్, యామి ఇద్దరు అంధులు గా నటించటం విశేషం.