రివ్యూ: ‘రాజు గారి గది 2′ మూవీ

కథ :
అశ్విన్ (అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఎప్పటికీ తమ స్నేహం అలాగే ఉండాలని ఆలోచనతో ముగ్గురు కలిసి ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ ఓ బిజినెస్ మొదలు పెడతారు. విశాఖపట్నం బీచ్ లో ఉండే రాజుగారి బంగ్లా కొని అందులో రిసార్ట్ స్టార్ట్ చేస్తారు. రిసార్ట్ కు వచ్చిన సుహానిస (సీరత్ కపూర్) మీద కిశోర్, ప్రవీణ్ లు మనసుపడతారు. అయితే ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నంలో వారికి ఆ రిసార్ట్ లో దెయ్యం ఉందని తెలుస్తుంది.

దెయ్యం పని పట్టేందుకు దగ్గరలోని చర్చి ఫాదర్ ను కలిస్తే ఆయన రుద్ర ( నాగార్జున) గురించి చెప్తాడు.  ప్రపంచంలోనే అత్యుత్తమ మెంటలిస్ట్ లలో ఒకడైన రుద్ర, సైన్స్ గురించి ఎంత తెలిసిన మన పాత ఆచారాలను, నమ్మకాలను పాటిస్తుంటాడు. రిసార్ట్ కు వచ్చిన రుద్ర.. అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ రిసార్ట్ లో తిరుగుతుందని, ఏవో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఆ ఆత్మ ప్రయత్నిస్తుందని కనిపెడతాడు. అమృత ఎవరు..? ఎలా చనిపోయింది..? అమృత తెలుసుకోవాలనుకుంటున్న సమాధానాలు ఏంటి..? ఆ సమాధానాలు అమృతకు తెలిసాయా..? రుద్ర ఆత్మకు ఎలా సాయం చేశాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటి ఇస్తున్న సీనియర్ హీరో నాగార్జున రాజు గారి గది 2తో మరో విభిన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రయోగాలకు ఎప్పుడు ముందుండే నాగ్, ఈ సినిమాలో మెంటలిస్ట్ రుద్ర పాత్రలో మెప్పించారు. మనసులోని భావాలను పసిగట్టే పాత్రలో నాగ్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత నాగార్జున కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో ఈ ఇద్దరి నటన కట్టిపడేస్తుంది. సమంత తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బబ్లీగా కనిపించిన సామ్, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ సాధించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది.సీరత్ కపూర్ కు నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా.. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ షోతో అలరించింది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ లు భయపడుతూనే నవ్వించారు. మరో ముఖ్యమైన పాత్రలో అభినయ ఆకట్టుకుంది. క్లైమాక్స్ సీన్స్ లో సమంతతో పోటీ పడి నటించింది.

Plus Points:

  • కథ, కథనం
  • హర్రర్ కు కామెడిని జత చేసి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం సక్సెస్ అయ్యింది.
  • బొమ్మాళిగా పూర్ణ, అశ్విన్, చేతన్ ల నటన బావుంది.
  • షకలక శంకర్, ధనరాజ్, విద్యుల్లేఖ పోటీ పడి కామెడి పండించే ప్రయత్నం చేశారు.
  • సాయి కార్తీక్ మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ
  • సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్
  • నిర్మాణ విలువలు చాలా బావున్నాయి

Minus Points:

  • దయ్యమున్న ఇంటికి వెళ్లడం అనే కాన్సెప్ట్ పాతదే.
  • ఫస్టాఫ్ లో కామెడీతో సాగిన సినిమా సెకండాఫ్ లో కాస్త డల్ గా సాగినట్టు అనిపిస్తుంది

టైటిల్         : రాజు గారి గది 2
జానర్         : హర్రర్ థ్రిల్లర్
తారాగణం    : నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిశోర్, అభినయ, నందు
సంగీతం      : ఎస్.తమన్
దర్శకత్వం    : ఓంకార్
నిర్మాత        : ప్రసాద్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి

Rating: 2.75 / 5

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *