రాజు గారు మొదటి రోజు ఎంత లాగారు?

టాక్ అండ్ రివ్యూ పరంగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న రాజు గారి గది 2 బుధవారం రాజా ది గ్రేట్ వచ్చే దాకా సోలో ఎడ్వాంటేజ్ ని బాగా వాడుకునేలా కనిపిస్తున్నాడు. కామెడీ హారర్ పరంగా రెగ్యులర్ గానే ఉంది అనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ ఎమోషన్స్ ని ప్రెజెంట్ చేయటంలో ఓంకార్ సక్సెస్ అవ్వడం,తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ప్లస్ పాయింట్స్ గా మారి సినిమా మెజారిటీ ఆడియన్స్ ని మెప్పించే దిశగా సాగుతోంది.

సమంతా పెర్ఫార్మన్స్, రుద్రాగా నాగ్ రోల్ సినిమా లెవెల్ ని బాగా పెంచాయి. ఓవరాల్ గా భీభత్సమైన కలెక్షన్స్ కాదు కాని ఓపెనింగ్స్ పరంగా ఆశించిన మేరకు డీసెంట్ ఫిగర్స్ రాజు గారి గది 2 రాబట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే కాని ఇలాంటి మూవీస్ కి స్పీడ్ పెరగదు. కాని ఆ సెక్షన్ ని థియేటర్ కు రప్పించే అప్పీల్ సినిమాలో తక్కువగా ఉండటం కొంచెం ఇబ్బంది కలిగించే విషయం.

ఓపెనింగ్ రోజు రాజు గారి గది 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4 కోట్ల 30 లక్షల షేర్ సాధించినట్టు సమాచారం. యుఎస్ ప్రీమియర్స్ ద్వారా 80 వేల డాలర్లు(52 లక్షలు)దాకా వసూలు అయినట్టు ట్రేడ్ రిపోర్ట్. టాక్ బాగుంది కాబట్టి వీక్ ఎండ్ బెనిఫిట్ తీసుకుని ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. సినిమా పెట్టిన బడ్జెట్ ని విడుదలకు ముందే ప్రీ రిలీజ్ రూపంలో రాబట్టుకున్న పివిపి సంస్థ శాటిలైట్ , డిజిటల్, ఆన్ లైన్ తదితరాలు అన్ని కలుపుకుని భారీ లాభాలతోనే క్లోజ్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.

మిలియన్ మార్క్ రీచ్ అవ్వడం గురించి ఇప్పుడే చెప్పలేం కాని రెస్పాన్స్ చూస్తే మాత్రం టైం పట్టినా చేరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మామ కోడళ్ళు కలిసి మంచి హిట్టే కొట్టారు. దర్శకుడు ఓంకార్ తన తరువాతి సినిమా కూడా పివిపితోనే చేయబోతున్నాడు. అది హారరా లేక కమర్షియల్ సబ్జెక్టా అనే డీటెయిల్స్ మాత్రం బయటికి చెప్పడం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *