కృష్ణవంశీని తీవ్రంగా విమర్శించిన డ్యాన్స్‌మాస్టర్‌!

తెలుగు సినిమా పరిశ్రమలో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పేరొందిన కృష్ణవంశీపై తీవ్రంగా ధ్వజమెత్తాడు డ్యాన్స్‌ డైరెక్టర్‌ రాకేష్‌ మాస్టర్‌. రాయలేని స్థాయిలో కృష్ణవంశీని విమర్శించాడు. కృష్ణవంశీని అందరూ క్రియేటివ్‌ డైరెక్టర్‌ అంటారని, కానీ అతను ఓ బచ్చా డైరెక్టర్‌ అని అన్నాడు. వందల పాటలకు కొరియోగ్రఫీ అందించిన రాకేష్‌ మాస్టర్‌.. కృష్ణవంశీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘చక్రం’ సినిమాలో ‘జగమంత కుటుంబం’ అనే పాటకు కొరియోగ్రఫీ చేశాడు.
ఆ పాటకు సంబంధించిన విషయంలోనే రాకేష్‌ మాస్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ పాట కోసం 11 రోజుల పాటు పనిచేశాడట రాకేష్‌ మాస్టర్‌. అయితే రాకేష్‌ను పక్కనపెట్టి పనులన్నీ కృష్ణవంశీయే చేసుకునేవాడట. అంతేకాదు ఆ పాట చేసినందుకు డబ్బులు కూడా ఇవ్వలేదట. దాంతో తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీపై నిప్పులు చెరిగాడు. ‘అతని క్రియేటివిటీ ఏంటో నాకు అర్థం కాదు. అందుకే ఇప్పుడు అతను రోడ్డున పడ్డాడు. హిట్స్‌ లేవు. అలాంటి డైరెక్టర్‌ను నా జీవితంలో మర్చిపోలేన’ని అన్నాడు. కొన్ని రాయలేని పదాలతో కూడా కృష్ణవంశీని ధూషించాడు రాకేష్‌ మాస్టర్‌.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *