భారతీయుడు-2లో రకుల్ కి అవకాశం?

కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు అవకాశం వచ్చిందని కోలీవుడ్‌ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో కాజల్‌ అగర్వా్ల్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈమె కాకుండా ఇప్పటికే మరో ఇద్దరు నటీమణులను కీలక పాత్రల కోసం ఎంపికచేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నా ఈ అమ్మడుకు అవకాశాలు తలుపుతడుతూనే ఉన్నాయి. తెలుగులో స్టార్‌ నటుడు నాగార్జునకు జంటగా మన్మథుడు–2 చిత్రంలో నటించింది. హిందీలో ఒక చిత్రం చేస్తోంది. ఇక తమిళంలో శివకార్తికేయన్‌ సరసన నటించనుంది. ఇప్పుడు భారతీయుడులో నటించే అవకాశం వచ్చింది.

శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాష్‌కరణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రాబోతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *